ఎండలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు 

ఎండలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు 

ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా జయంతిపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నేల మీద కూర్చొనే విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో స్టూడెంట్స్ ను ఎండలోనే కూర్చొబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అరకొరగా కల్పించే సదుపాయాలు సరిపోవడం లేదంటున్నారు. స్టూడెంట్స్ ను ఎండలో కూర్చోబెట్టకుండా చెట్ల కింద నీడలో కూర్చెబెట్టి పాఠాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు ఉన్నా. అవి తిరగవు. ఒకవేళ ఏదో ఒకటి తిరిగినా వెచ్చగా వేడి గాలి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాదు తరగతి గదులు కూడా చీకటి గా మారిపోయాయని చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం


కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం