కల్తీ ఆహారాన్ని సహించేదే లేదు.. ఏరిపారేస్తా అలాంటోళ్లను: యోగీ వార్నింగ్

కల్తీ ఆహారాన్ని సహించేదే లేదు.. ఏరిపారేస్తా అలాంటోళ్లను: యోగీ వార్నింగ్

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక చేశారు. ఆహారాన్ని  వ్యర్థాలతో గానీ, ఇతర ఏ హానికరమైన పదార్థాలతో గానీ  కల్తీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆహారంలో కల్తీపై యూపీ సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. 

ఇదే అంశంపై మంగళవారం నాడు అధికారులతో సీఎం యోగి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అన్ని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు.. ఆహారాన్ని విక్రయించే ఇతర స్టాల్స్ అన్నింటిపై విచారణ జరపాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం అవసరమైతే ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలు కూడా చేయాలని సూచించారు.

ALSO READ | మద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది: సుప్రీంకోర్టు

ఇటీవల దేశంలోని పలు చోట్ల జ్యూసుల్లో, పప్పు, రోటీ.. ఇలా కొన్ని ఆహార పదార్థాలను హానికరమైన వ్యర్థాలతో కల్తీ చేశారని.. ఇది అత్యంత దారుణమైన విషయమని యూపీ సీఎం చెప్పారు. కస్టమర్లు కూర్చుని తినే ఏరియాలోనే కాకుండా వంట చేసే ఏరియాలో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి తీరాలని దాబాలకు, హోటల్స్కు, రెస్టారెంట్లకు సీఎం హుకుం జారీ చేశారు. ఫుడ్ సెంటర్స్ అన్నీ శుభ్రతను పాటించి తీరాలని చెప్పారు. రూల్స్ పాటించడంలో ఏదైనా తేడా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఫుడ్ సెంటర్స్ యాజమాన్యాలకు స్పష్టం చేశారు.

ALSO READ | కల్తీ ఆహారాన్ని సహించేదే లేదు.. ఏరిపారేస్తా అలాంటోళ్లను: యోగీ వార్నింగ్

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూ తయారీ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తరుణంలో యూపీ సీఎం ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిసైడ్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్‌‌‌‌కు చెందిన నేషనల్‌‌‌‌ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌డీడీబీ) కాఫ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది.