IND vs BAN 2024: కాన్పూర్ టెస్ట్‌కు వింత సమస్య.. కాపలాగా కొండముచ్చులు

IND vs BAN 2024: కాన్పూర్ టెస్ట్‌కు వింత సమస్య.. కాపలాగా కొండముచ్చులు

కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కు విచిత్ర సమస్య వచ్చింది. అక్కడ కోతుల రూపంలో సమస్య తలెత్తుతుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అసలు విషయం ఇక్కడే ఉంది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న గ్రీన్ పార్క్ స్టేడియంకు ఒక చిన్న కథ ఉంది. ఈ గ్రౌండ్ అంటే కోతులకు భలే ఇష్టమట. జనాలు లేని సమయంలో వచ్చి అక్కడకు వచ్చి ఆడుకొని వెళ్ళిపోతాయట. ఈ విషయాన్ని అక్కడ ఉన్న స్థానికులు చెప్పుకొచ్చారు. 

ఈ స్టేడియం గంగా నదికి సమీపంలో ఉంది. చుట్టూ సహజ వృక్షజాలం జంతుజాలం ​​ఉన్నాయి. క్రికెట్ అభిమానులతో స్టేడియం నిండిపోనప్పుడు జంతువులు ఈ స్థలాన్ని తమ నివాసంగా చేసుకుంటాయి. నివేదికల ప్రకారం సుమారు 250-300 కోతులు ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. మ్యాచ్‌లు జరిగినప్పుడు కూడా కొన్ని భయం లేని కోతులు ప్రేక్షకుల నుండి ఆహారం, మొబైల్ ఫోన్‌ల వంటి ఇతర వస్తువులను లాక్కుంటాయి. 

ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఈ గ్రౌండ్ లోనే జరుగుతుంది. ఎప్పటిలాగే కోతులు ఈ గ్రౌండ్ లోకి వచ్చి వెళ్తున్నాయట. తొలి రోజు ప్రాక్టీస్ లో భాగంగా కోతులు హల్ చల్ చేశాయి. కోతులను తరిమికొట్టేందుకు సెక్యూరిటీ గార్డులను నియమించగా, స్టేడియంలో అధికారులు ఇక్కడికి వచ్చే వాళ్లకు భద్రత కల్పించేందుకు కొండముచ్చులను తీసుకువచ్చారట. వెన్యూ డైరెక్టర్ సంజయ్ కపూర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారుతుంది. 

ALSO READ|  IND vs BAN 2024: శాంతించిన వరుణుడు.. ఆలస్యంగా భారత్- బంగ్లాదేశ్ టెస్ట్

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండా ఆటను ఆపేశారు. బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. ఇప్పటికే రెండో టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.