కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదే.. : డిప్యూటీ సీఎం బ్రిజేశ్​ పాఠక్

నల్గొండ అర్బన్ వెలుగు : దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపడతారని ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేశ్​ పాఠక్ అన్నారు. నల్గొండ క్లాక్​టవర్​సెంటర్​లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర (కృష్ణమ్మ క్లస్టర్​) ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, లీడర్లు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, వీరేలి చంద్రశేఖర్, శ్రీదేవి రెడ్డి, గార్లపాటి జితేంద్రకుమార్, బండారు ప్రసాద్ ఉన్నారు.