Agricultural : కాలీ ఫ్లవర్ పండిస్తూ.. ఊరంతా ధనవంతులు అయిన రైతులు

Agricultural : కాలీ ఫ్లవర్ పండిస్తూ.. ఊరంతా ధనవంతులు అయిన రైతులు

కొన్ని రకాల పంటలను సాగు చేయడం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులు(Farmers)అలాంటి పంటలను సాగుచేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పంటల్లో కాలీఫ్లవర్(Cauliflower)ఒకటి. అలా వ్యవసాయ నిపుణుల మాటలు తూచా తప్పకుండా పాటించారు . ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ కు చెందిన ఓ రైతు కాలీఫ్లవర్​ సాగు చేసి ఏడాదిలోనే రూ. 50 లక్షలు ఆదాయాన్ని సంపాదించాడు.త

తక్కువ పెట్టుబడితో కేవలం 90 రోజుల్లో దిగుబడి వచ్చే కాలీ ఫ్లవర్ సాగుతో50 లక్షల రూపాయిల ఆదాయాన్నిగడించాడు. కాలీఫ్లవర్​ శీతాకాలపు పంట అయినా.. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో దొరుకుతుంది. ఈ పంట సాగుతోఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో రైతులు ధనవంతులవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని  రైతులు  సాంప్రదాయ పంటలకు బదులుగా కాలీఫ్లవర్ వంటి కొత్త పంటల సాగుపై దృష్టి సారించారు. ఒక్కో బిగాకు అంటే  0.25హెక్టార్లు( 0.625 ఎకరాలు) అంటే దాదాపు ఎకరం భూమిలో మూడవ వంతు భూమిలో  రూ.2 వేల పెట్టుబడితో కాలీఫ్లవర్ సాగు చేసి రూ. 50 లక్షలు సంపాదించాడు.   

ఉత్తరప్రదేశ్​ లోనిమాలిక్‌పూర్ గ్రామానికి రైతు రాజ్‌పాల్ రెండు దశాబ్దాలుగా ఎలాంటి నష్టం లేకుండా కాలీఫ్లవర్‌ను సాగు చేశాడు. దీంతో ఏటా లక్షల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారు. . ఈ పంటను సాగు చేసేందుకు  పొలాన్ని చదును చేసి మట్టిని సిద్ధం చేసిన తర్వాత మీటరుకు మూడు క్యాలీఫ్లవర్ మొక్కలు నాటినట్లు తెలిపారు. సకాలంలో మొక్కలకు నీరు పెట్టి వ్యవసాయాధికారుల సూచనలను పాటిస్తే పంట సమృద్ధిగా  లభిస్తుందని  రాజ్‌పాల్ అన్నారు. 

క్యాలీఫ్లవర్‌కు మార్కెట్‌లో డిమాండ్..

కాలీఫ్లవర్ లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అధికంగా సీ విటమిన్ తో పాటు కె విటమిన్, పోటాషియం, మాంగనీస్, ప్రొటీన్, రైబోప్లేవిన్, మోమిన్ లు ఉన్నాయి. అందువల్ల కాలీఫ్లవర్ ను ఆహారంలో తీసుకోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని సైతం కాలీఫ్లవర్ తగ్గిస్తుంది. అందువల్ల దీనికి మార్కెట్ డిమాండ్ అధికంగానే ఉంటుంది.

లాభసాటి పంటలపై రైతు దృష్టి..

అంతేకాక మార్కెటింగ్ సైతం తానే చేస్తూ ప్రంశసలు అందుకుంటున్నాడు.సాధారణంగా కాలీ ఫ్లవర్ ఒక్కో పువ్వు కిలో నుంచి కిలోన్నర బరువు పెరుగుతుందని.. ఆ మేర దిగుబడి చేస్తే ఈ పంట సాగుకు  వాతావరణం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచించడంతో.. ఈ సాగు చేస్తున్నట్లు రాజ్‌పాల్  చెప్పుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయ కూలీలు  అధికంగా ఉండడంతో పంటకు డిమాండ్ భారీగా ఉంటున్నట్లు వెల్లడించాడు.  గతంలో వంగ, బీర, కాకర వంటి కూరగాయల సాగు చేసి నష్టపోయిన ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలీ ఫ్లవర్ సాగుకు అవసరమైనమొక్కల్ని. కొనుగోలు చేశాడు. పంటకు అవసరమైన పురుగుల మందుల నిమిత్తం ఒక బిగా భూమికి 2వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు.