లక్నో: దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి సెలవు (అక్టోబర్ 31)కి కొనసాగింపుగా 2024, నవంబర్ 1వ తేదీన కూడా పబ్లిక్ హాలీ డే ప్రకటించింది. ఈ మేరకు 2024, అక్టోబర్ 30న యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు లీవ్స్ లభించాయి.
అక్టోబర్ 31 దీపావళి, నవంబర్ 1 (శుక్రవారం) పబ్లిక్ హాలీడే, నవంబర్ 2 (శనివారం) విక్రమ్ సంవంత్ నూతన సంవత్సరం, బలి ప్రతిపద, నవంబర్ 3 (ఆదివారం) వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. తిథి ప్రకారం ఈ సంవత్సరం దీపావళి వేడుకలు అక్టోబర్ 31న ప్రారంభమై.. నవంబర్ 1 సాయంత్రం వరకు కొనసాగడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నవంబర్ 1వ తేదీన పబ్లిక్ హాలీ డే ప్రకటించినట్లు తెలుస్తోంది.
ALSO READ | Diwali 2024: దీపావళి పండుగ అక్కడఅలా... ఇక్కడ ఇలా...
యోగి సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖాండ్ ప్రభుత్వం కూడా ఉత్తరప్రదేశ్ సర్కార్ తరహాలోనే నవంబర్ 1వ తేదీన పబ్లిక్ హాలీ డే ప్రకటించింది. దీంతో ఉత్తరఖాండ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఉద్యోగులు, స్టూడెంట్స్ ఖుష్ అవుతున్నారు.