అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యాడు

యూపీ : పరీక్షల్లో పాసయ్యేందుకు కొందరు పగలురాత్రన్న తేడా లేకుండా కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం వక్రమార్గం ఎంచుకుంటారు. యూపీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్షల్లో పాసయ్యేందుకు ఒక వ్యక్తి ఇలాగే అడ్డదారి తొక్కాడు. కాపీ కొట్టేందుకు హై టెక్నాలజీ వాడి అధికారుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. 
ఉత్తర్ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది ఇతర అభ్యర్థుల్లాగే అతన్ని చెక్ చేశారు. కానీ మెటల్ డిటెక్టర్ అతని తల వద్దకు రాగానే బీప్ మంటూ శబ్దం వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని  అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తి తల పరిశీలించగా.. అతను విగ్ పెట్టుకున్నాడని అర్థమైంది. దాన్ని తొలగించి చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఎగ్జామ్ లో చీటింగ్ చేసేందుకు సదరు కేటుగాడు ఓ సిమ్, బ్యాటరీతో పాటు కొన్ని వైర్లులతో ఓ హైటెక్ సెటప్ ను విగ్లో అమర్చుకున్నాడు. అతి చిన్న ఇయర్ ఫోన్లను చెవుల్లో పెట్టుకున్నాడు. ఎవరికీ కనిపించనంత చిన్నగా ఉన్న ఆ ఇయర్ ఫోన్లను బయటకు తీయడం చాలా కష్టమైంది. రూపిన్ శర్మ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్ లో 55శాతం పెరిగిన మోసాలు

న్యూఇయర్ కోసం గోవా నుంచి డ్రగ్స్

నవోదయ స్కూల్లో కరోనా కలకలం