ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మరో హిందూ పుణ్యక్షేత్రం కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ.. జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ఈ రోజు సాధువుల భక్తితో, ప్రజల స్ఫూర్తితో మరో పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన జరుగుతోందన్నారు. ఆచార్యులు, సాధువుల సమక్షంలో మహా కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు. భారతీయ విశ్వాసానికి కల్కి ధామ్ మరో గొప్ప కేంద్రంగా మారుతుందని చెప్పారు.
ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కూడా కాబట్టి ఈ రోజు మరింత పవిత్రమైంది,స్ఫూర్తిదాయకమైనదన్నారు మోదీ. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాదాలకు మోదీ నివాళి అర్పించారు.
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi attends the foundation stone laying ceremony of Hindu shrine Kalki Dham in Sambhal.
— ANI (@ANI) February 19, 2024
Uttar Pradesh CM Yogi Adityanath and Shri Kalki Dham Nirman Trust Chairman Acharya Pramod Krishnam also present. pic.twitter.com/pTxIn1IJof