ఆ రాష్ట్రంలో 34 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఏకంగా 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే దేశ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలా కీలకం. అంత మందికి ఎన్నికలు నిర్వహించాలంటే ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేయాలి..? ఏప్రిల్ 19 నుంచి అక్కడ ఏడు దశల్లో లోక్ సభ ఎలక్షన్లు జరగనున్నాయి. అక్కడ 1.62లక్షల పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. 82వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. పోలింగ్ బూత్ ప్రతి 2కి.మీ పరిధిలోనే ఉండాలన్న నిబంధనతో ఎత్తైన అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్మూనిటీ కాలనీల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇలా చేయడం దేశంలోనే ఫస్ట్ టైం. ఇలా ఎత్తైన అపార్ట్‌మెంట్ బిల్డింగుల్లో 217 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఎతైన ప్రమాదకర ప్రదేశాలు కూడా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) నవదీప్ రిన్వా మాట్లాడుతూ.. చాలా వరకు పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేలా చూసుకున్నామని, వీల్‌ఛైర్లు, వికలాంగ ఓటర్లకు ర్యాంపులు, మరుగుదొడ్లు, లైటింగ్, తాగునీరు, ఏర్పాట్లు చేశామని తెలిపారు. హెల్ప్ డెస్క్, వాలంటీర్లు, సైన్ బోర్డ్స్ పెట్టామన్నారు.