ఇన్స్టాలో రీల్స్ పిచ్చి..ఓ మహిళా కానిస్టేబుల్ ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.ఓ మహిళా కానిస్టేబుల్ డ్యూటీలో ఇన్ స్టా గ్రామ్ కోసం రీల్స్ చేసి పోస్ట్ చేయడంతో.. అది చూసిన ఆఫీసర్ కు చిర్రెత్తు కొచ్చింది. చేసేది బాధ్యతగల పోలీస్ ఉద్యోగం..అందులో డ్యూటీ టైంలో ఎంటర్ టైన్ మెంట్ పనులేంటి..ఇలా అయితే ప్రజలకు ఎలా సేవలందిస్తారు అంటూ చీవాట్లు..డ్యూ్టీలో ఉండి ఇవేం పనులు అంటూ మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్ కు కస్ గంజ్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆర్తీ సోలంకి.. సహవర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది. సోలంకికి రీల్స్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ చేయడం అలవాటు.దీంతో తరుచుగా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈక్రమంలో ఓ రోజు పోలీస్ యూనిఫాంలోనే డ్యూటీలో ఉండి రీల్స్ చేసింది.
1980లో అమితాబ్ బచ్చన్ , శత్రుఘ్న సిన్హా.. నటించిన యాక్షన్ డ్రామా దోస్తానా లోని తేరీ మేరీ దోస్తీ ప్యార్ మే బాదల్ గయా’ సాంగ్ కు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. అయితే సోలంకీ చేసిన తప్పేంటంటే.. డ్యూటీ లో ఉండి పోలీస్ యూనిఫాంలో ఆ పాటకు యాక్ట్ చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియాలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లింది. వీడియో చూసిన జిల్లా ఎస్పీకి చిర్రెత్తుకొచ్చింది. డ్యూటీలో ఉండి చేసే పనులు ఇవా.. అంటూ చీవాట్లు పెట్టాడు..డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు.
महिला सिपाही ने "तेरी मेरी दोस्ती प्यार में बदल गई" गाने पर बनाई रील
— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) November 8, 2023
कासगंज एसपी को नही आई पसंद, कर दिया निलंबित... pic.twitter.com/sEEaoB7dPL