ప్రజలను విభజించి పాలిస్తున్నారు

ప్రజలను విభజించి పాలిస్తున్నారు
  • ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్

డెహ్రాడూన్: మతం ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారని ఆరోపించారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్. యూపీలోనూ బీజేపీ ఇదే చేసిందన్నారు. మతాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చిన బీజేపీ..ప్రజలకు చేసిందేమిటని నిలదీశారు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేయాలే తప్ప.. మతం చూసి కాదన్నారు భూపేష్ బఘేల్.
డెహ్రాడూన్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ  అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా  ప్రచార థీమ్ మరియు 'ఉత్తరాఖండ్ స్వాభిమాన్ చార్ ధామ్ చార్ కామ్' పేరుతో ప్రచారం కోసం రూపొందించిన పాటను ఛత్తీస్ గఢ్ సీఎం బఘేల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉందన్నారు. నోయిడాలో కూడా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. 

 

 

ఇవి కూడా చదవండి

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

మెడికల్ షాపుల్లోకంటే.. ఆన్ లైన్ లో తక్కువ ధరకే మెడిసిన్​

విరాట్ కోహ్లీ పెళ్లిపై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

హిందూత్వను వదులుకోలే.. బీజేపీతో దోస్తీ వద్దనుకున్నం