ఇవాళ ఉదయం 6 గంటల 25 నిమిషాలకు ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు తెరిచారు. ఈనెల 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. భార్యతో కలిసి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 8న బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు. గంగోత్రికి రోజుకు 7వేల మందిని.. యమునోత్రికి రోజుకు 4 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. కేదార్ నాథ్ ఆలయ దర్శనానికి రోజుకు 12 వేల మందిని అనుమితించనున్నట్లు తెలిపారు.
చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు గుప్త కాశీ, సోన్ ప్రయాగ్ లోని వైద్య కేంద్రాల దగ్గర హెల్త్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. భక్తుల బీపీ చూసి.. ఆరోగ్యం సహకరిస్తే.. వైద్య ధ్రువీకరణ పత్రం ఇస్తారన్నారు. చార్ ధామ్ యాత్రకు డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరని స్పష్టం చేశారు అధికారులు.
#WATCH | The doors of Kedarnath Dham opened for devotees. Kedarnath's Rawal Bhimashankar Linga opened the doors of Baba Kedar. On the occasion of the opening of the doors thousands of devotees were present in the Dham. pic.twitter.com/NWS4jtGstb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 6, 2022
మరిన్నివార్తల కోసం