ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

డెహ్రాడూన్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో విజయఢంకా మోగించినప్పటికీ బీజేపీకి షాక్ తలిగింది. ప్రస్తుత సీఎం, బీజేపీ అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,951 ఓట్లతో ఓటమిపాలైయ్యారు. 46ఏళ్ల పుష్కర్ సింగ్ ధామీ గతేడాది తీరథ్ సింగ్ రావత్ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి చెందిన సిట్టింగ్ సీఎం ఓడిపోవడం ఆ పార్టీ కర్యకర్తలను నిరాశకు గురి చేసింది.

ఉత్తరాఖండ్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ను దాటేయడంతో అధికారం చేపట్టడం ఖాయంగా మారింది. ఇదిలా ఉంటే లాల్ కాన్ స్థానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ సైతం ఓటమి పాలయ్యారు. ఒకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థులు ఓడిపోవడం విశేషం.