పుష్కర్ ధామి ఘన విజయం.. అభినందనలు తెలిపిన మోడీ

పుష్కర్ ధామి ఘన విజయం.. అభినందనలు తెలిపిన మోడీ

ఒడిశా, కేరళ, ఉత్తరాఖండ్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌‌ను 2022, జూన్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఒడిశాలోని బ్రజరాజ్ నగర్(Brajarajnagar), కేరళలోని త్రిక్కకర (Thrikkakara), ఉత్తరాఖండ్ చంపావత్ (Champawat)లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు మే 31న పోలింగ్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గం నుంచి పరాజయం చెందిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్.. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థిపై 55 వేల ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా...ధామికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. చంపావత్ మంచి రికార్డు విజయం సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నట్లు, ఉత్తరాఖండ్ అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో మోడీ తెలిపారు.

అలాగే బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ధామి కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల ద్వారా తనపై కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడినని ట్వీట్ లో తెలిపారు. చంపావత్ (Champawat)లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసిందన్నారు. త్రిక్కకర (Thrikkakara) నియోజకవర్గంలో యుడిఎఫ్ (UDF) అభ్యర్థి ఉమా థామస్ 23,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎర్నాకులం మహారాజా కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉమా గెలుపు ఖాయమని అనుకున్న కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తల కోసం : - 

జీవనశైలిలో గాంధీ కన్నా స్ఫూర్తి ఇంకెవరు ?


మూడు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల కౌంటింగ్