ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం జరిగే బీజేపీ జనసభకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ దామి హాజరు కానున్నారని బీజేపీ స్టేట్​ లీడర్, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్​రావు తెలిపారు. ఆదివారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ జన సభలో ప్రజలు, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాల్సిందిగా కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు కంభంపాటి ప్రతాప్, గోగుల రాణాప్రతాప్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.