న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో వరద ప్రవాహం 500 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ఢిల్లీపై ప్రభావం చూపింది. వేలాది ఇండ్లకు తాగునీటి సప్లయ్ నిలిచిపోయింది. వరద ప్రవాహంతో రిషిగంగా వ్యాలీలో పెద్దఎత్తున మట్టి, శిథిలాలు పేరుకుపోయాయని, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఫుల్ కెపాసిటీతో పని చేయడంలేదని, తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని అధికారులు అంటున్నారు. అయితే ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఢిల్లీ వాటర్ బోర్డు వైస్ చైర్ పర్సన్ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఫుల్ కెపాసిటీతో పని చేయడంలేదన్నారు. మట్టి, బురద వల్ల ఫిల్టర్లను క్లీన్ చేయడానికి సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నారని తెలిపారు. 2 కోట్లకుపైగా జనాభా ఉన్న ఢిల్లీలో ఏటా సమ్మర్లో వాటర్ సమస్య ఎదురవుతుంది. యమునా నది నుంచి 60%, గంగా నది నుంచి 34% నీళ్లు ఢిల్లీకి సప్లయ్ అవుతాయి. ధౌలిగంగలో మంచు చరియలు విరిగిపడి పోటెత్తిన వరదతో నది మొత్తం బురదమయమై ప్రవహిస్తోంది.
For More News..
ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది
కేసీఆర్పై బాహుబలి రేంజ్లో డాక్యుమెంటరీ
ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది