పాత పద్దతిలో మెగా156 మొదలు.. అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ అండ్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Mallidi Vasishta) రూపొందించనున్న మెగా156 మూవీకి సంబంధించిన సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌(UV Creations) పంచుకుంది.

ఇవాళ మంగళవారం మెగా156 సినిమా పూజా కార్యక్రమం జరుపుకుంది. గతంలో పాటించిన ఓ ఆనవాయితీని ఈ చిత్రంతో మళ్లీ ప్రారంభిస్తున్నట్లు యూవీ క్రియేషన్స్‌ తెలిపింది. చిరంజీవి పూజా కార్యక్రంలో పాల్గొని దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో భాగమైన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ స్టూడియోలో నుంచి మాట్లాడుతూ..పాత రోజుల్లో మ్యూజిక్ కంపొజిషన్స్ తోనే సినిమాను మొదలుపెట్టే వారిమంటూ..అటువంటి సంప్రదాయాన్ని తిరిగి తీసుకువచ్చింది ఈ మెగా 156 టీం అని తెలిపారు. 

మరో ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ..ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కి, డైరెక్టర్ కి థ్యాంక్స్ అని..ఈ సినిమా నుంచి వచ్చే సాంగ్స్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటాయని వెల్లడించారు. దీంతో ఈ మూవీ త్వరలో షూటింగ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది.   

మైథలాజికల్ జానర్ లో రానున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ తోనే..మెగా ఫ్యాన్స్ కు హై లెవెల్ హోప్స్ ఇచ్చారు డైరెక్టర్. ఇలా రిలీజైన ప్రతి పోస్టర్ లో మెగా మాస్..బియాండ్ యూనివర్స్ అనే క్యాప్షన్ ఇస్తూ వస్తున్నారు. పంచభూతాలతో కూడిన సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతుంది కాబట్టి డైరెక్టర్ ఏదో గట్టిగా చెప్పడానికి సిద్దమయ్యినట్లు స్పష్టంగాతెలుస్తోంది.

ALSO READ :- RSA vs BAN: దక్షిణాఫ్రికా బ్యాటింగ్.. ఇరు జట్లలో కీలక మార్పులు

ఈ  పూజా కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, డైరెక్టర్ వివి వినాయక్,ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ మూవీలో చిరుకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే సమాచారం. ఇంకా ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో నిలపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.