భగవంత్ కేసరి నుంచి.. ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్ట్ చేస్తున్న మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్య కు జోడిగా కాజల్(Kajal) నటిస్తుండగా.. శ్రీలీల(SreeLeela) కీలక పాత్రలో నటిస్తోంది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉయ్యాలో ఉయ్యాలో..నా ఊపిరే నీకు ఉయ్యాలా..ఔమల్లా ఔమల్లా..ఈ చేతుల్లో నిన్ను మొయ్యలా..అంటూ సాగే ఈ సాంగ్..ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఈ మూవీలో బాలయ్య అన్న కూతురుగా శ్రీలీల నటిస్తోంది. చిన్నతనం నుంచి శ్రీలీల..బాబాయ్ బాలయ్య ఒడిలోనే పెరిగినట్లు..ఈ సాంగ్లో లిరిక్స్ చక్కగా పొందుపరిచారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు అనంత శ్రీరామ్(Anantha Sriram) తన లిరిక్స్లో పొందుపరిచారు. నీకేమ్మన్న అయితే..నేనేమైపోతా..అంటూ ఎమోషన్ను చూపించారు.

ఎస్పీ చరణ్(SP Charan) తన మెస్మరైజింగ్ గొంతుతో ఎస్పీబీని గుర్తు చేశేలా సాంగ్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. థమన్ స్వరపరిచిన ఈ గీతం మరో ఫీల్ గుడ్ మెలోడీ ట్రాక్లో చేరడం కన్ఫమ్.   

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.త్వరలో ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానున్నాఈ మూవీ..ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.