ములుగు, వెలుగు: ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ ని ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూరిస్టులు ప్రాజెక్ట్‌ని చూడడానికి వచ్చి నీటిలో దిగి చనిపోతున్నారన్నారు. అందుకే ఇక్కడ గజ ఈతగాళ్లను, పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు. నిన్న హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు ప్రాజెక్ట్‌లో మునిగి చనిపోవడం చాలా బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ప్రాజెక్ట్వద్ద పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగనోల్ల మోహన్, కరుణాకర్ రెడ్డి, యాదగిరి, శ్రీను, సుఖేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్ గౌడ్, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమా ర్ఉన్నారు.