క్రెడాయ్ నేషనల్ మెంబర్​గా మధుసూదన్ రెడ్డి

మంచిర్యాల, వెలుగు: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) నేషనల్ కౌన్సిల్ మెంబర్​గా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన వి.మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ఇంతకుముందు రెండు సార్లు క్రెడాయ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2017లో మంచిర్యాల చాప్టర్ ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించి 18 నెలలపాటు చైర్మన్​గా బాధ్యతలు నిర్వహించారు.

తాజాగా క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ గుమ్మి రామిరెడ్డి ఆహ్వానం మేరకు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్​ప్రైజెస్​ వింగ్​లో నేషనల్ చైర్మన్ జగదీశ్ బాబు సారథ్యంలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న క్రెడాయ్ నేషనల్ స్టడీ టూర్ ను ఆయన  పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.