ఇస్రో కొత్త చైర్మన్​ నారాయణన్​

ఇస్రో కొత్త చైర్మన్​ నారాయణన్​

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చైర్మన్​గా వి.నారాయణన్​ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్​ ఎస్​.సోమనాథ్​ పదవీకాలం 2025, జనవరి 13తో ముగియనున్నది. జనవరి 14న నారాయణన్​ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేండ్లపాటు పదవిలో కొనసాగుతారు. 

తమిళనాడులోని కన్యాకుమారిలో వి.నారాయణన్​ జన్మించారు. ఐఐటీ ఖరగ్​పూర్​లో క్రయోజెనిక్​ ఇంజినీరింగ్​లో మొదటి ర్యాంకుతో ఎంటెక్​ పూర్తిచేశారు. 2001లో ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​లో పి.హెచ్.డి. పూర్తిచేశారు. 1984లో ఇస్రోలో చేరారు. ప్రాజెక్టు మేనేజ్​మెంట్​ కౌన్సిల్​ స్పేస్​ ట్రాన్స్​పోర్టేషన్​ చైర్మన్ గా, చంద్రుడిపై మనిషిని తీసుకెళ్లే స్పేస్​ ఫ్లైట్​ మిషన్​ నేషనల్​ లెవల్​ హ్యూమన్​రేటెడ్​ సర్టిఫైడ్​ బోర్డ్​ ఫర్​ గగన్​యాన్​ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణన్​ ప్రస్తుతం అంతరిక్షంలోకి శాటిలైట్లను తీసుకెళ్లేందుకు ఉపయోగించే లిక్విడ్​ ప్రొపల్షన్​ సిస్టమ్​ సెంటర్​ డైరెక్టర్ గా ఉన్నారు. 

శాటిలైట్​ లాంచ్​ వెహికల్స్, అందులో ఉపయోగించే కెమికల్స్, ఎలక్ట్రిక్​ ప్రొపల్షన్​ సిస్టమ్స్​ఫర్​ శాటిలైట్, లాంచ్​ వెహికల్​ కంట్రోల్​ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజనిక్​ ప్రొపల్షన్​దశలను ఆయనే పర్యవేక్షిస్తుంటారు. ఆదిత్య ఎల్​–1, చంద్రయాన్​–2, 3లోని చోదక వ్యవస్థల అభివృద్ధి ఆయన కృషిచేశారు. జిఎస్​ఎల్వీ ఎంకే–2, 3 వాహకనౌకల రూపకల్పనలో కీలక భూమికను పోషించారు.