కేసీఆర్​ విశ్వసనీయత చాటుకోవాలి : వి. ప్రభాకర్

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్​పోటీ చేయనున్నందున జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించి తన విశ్వసనీయతను చాటుకోవాలని సీపీఐ (ఎంఎల్)​ ప్రజాపంథా స్టేట్​సెక్రెటేరియట్​మెంబర్ వి. ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. గురువారం కామారెడ్డి ఆర్​అండ్​బీ గెస్ట్​హౌజ్​లో  ప్రజాపంథా జిల్లా ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు పట్టాల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని, బీడి కార్మికులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలన్నారు. జిల్లా సెక్రెటరీ పి.రామకృష్ణ, డివిజన్​ సెక్రెటరీ బాలరాజు, పీడీఎస్​యూ జిల్లా ప్రెసిడెంట్​సురేశ్, లీడర్లు పరమేశ్, నారాయణ, దేవీదాస్, సుశీల్​ తదితరులు పాల్గొన్నారు.