అమరావతి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వీ శ్రీనివాసరావు తిరిగి ఎన్నికయ్యారు. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమామహేశ్వరరావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు. వీరిలో ఏవీ నాగేశ్వరరావు (ఎన్టీఆర్ జిల్లా), బి. బలరాం (పశ్చిమ గోదావరి జిల్లా)ను కొత్తగా కార్యదర్శి వర్గంలోకి తీసుకున్నారు. కార్యదర్శి, కార్యదర్శివర్గంతో కలిసి ఉన్న 50 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.
ALSO READ | పెళ్లంటేనే భయపడేలా చేస్తున్నరుగా.. ఇదేం పాడు బుద్ధి.. 10 మంది బతుకులు ఆగమాగం.