‘వీ6’ కెమెరామెన్ పై దుండగుడి దాడి.. నారాయణగూడ పీఎస్లో కేసు నమోదు

‘వీ6’ కెమెరామెన్ పై దుండగుడి దాడి.. నారాయణగూడ పీఎస్లో కేసు నమోదు

బషీర్​బాగ్, వెలుగు: డ్యూటీలో ఉన్న ‘వీ6’ చానెల్​ కెమెరామెన్ పై ఓ వ్యక్తి అకారణంగా దాడికి పాల్పడ్డాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల12న మధ్యాహ్నం నారాయణగూడ దీపక్ థియేటర్ సమీపంలో వీర హనుమాన్ విజయ యాత్రను కెమెరామెన్ సిరికొండ మధుసూదన్ కవరేజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై ఓ దుండగుడు అకారణంగా దాడికి చేశాడు. 

తలతో బాధితుడి ముక్కుపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడే ఉన్న తోటి కెమెరామెన్ లు బాధితుడిని ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సున్నితమైన ముక్కు భాగంలో గాయం కావడంతో ఉస్మానియా డాక్టర్లు కోఠి ఈఎన్టీ హాస్పిటల్ కు  రిఫర్ చేశారు. అనంతరం అక్కడికి తీసుకెళ్లి బాధితుడికి టెస్టులు చేయగా , ముక్కు భాగంలో ఎముక విరిగినట్లు డాక్టర్లు గుర్తించి, ట్రీట్ మెంట్  అందించారు. 

అయితే, బాధితుడు దాడికి ముందు కెమెరాలో రికార్డు చేసిన వీడియోలో దాడి చేసిన వ్యక్తి దృశ్యాలను గుర్తించాడు. వాటి ఆధారంగా సదరు వ్యక్తిపై నారాయణగూడ పీఎస్​లో సోమవారం ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.