
హైదరాబాద్ సిటీ, వెలుగు: వీ6 చానెల్ కు ప్రఖ్యాత ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్ అవార్డు–2024 లభించింది. సినీ, వ్యాపార, మీడియా వంటి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ప్రొఫెషనల్స్, ప్రముఖ వార్తా పత్రికలు, టీవీ మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ప్రాంప్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఎమినెంట్ ప్రొఫెషనలిస్ట్ అవార్డ్స్ అందజేశారు. రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
వీ6 న్యూస్ చానెల్ తరఫున చీఫ్ జనరల్ మేనేజర్ అడ్వటైజ్మెంట్స్ యోగి అవార్డును అందుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో వీ6 చానెల్ కు వచ్చింది. పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో సంవద్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎండీ సామల వేణు అవార్డును అందుకున్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మీడియా, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మీడియా చట్టాలను డస్ట్ బిన్ లో పడేసిందని అసహనం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ క్రిటిసిజాన్ని అలవరుచుకోవాలని సూచించారు.