V6 స్టాఫ్​ రిపోర్టర్‌‌‌‌కు లాడ్లీ మీడియా అవార్డు

V6 స్టాఫ్​ రిపోర్టర్‌‌‌‌కు లాడ్లీ మీడియా అవార్డు

సంగారెడ్డి టౌన్ , వెలుగు: V6 మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీధర్​కు శనివారం లాడ్లీ మీడియా అవార్డు వరించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని  జైపూర్ కు చెందిన లాడ్లీ మీడియా సంస్థ గృహహింస, మహిళా సాధికారత, మహిళా సమస్యలపై పోరాడే కథనాలకు ఈ అవార్డులు అందజేస్తోంది. 13వ ఎడిషన్ లో భాగంగా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన మహిళలు బెల్ట్ షాపుల నిర్వాహణపై సమష్టిగా పోరాడి జైలుకు వెళ్లారు. దీనిపై అద్భుత కథనం రాసినందుకు రిపోర్టర్ శ్రీధర్​కు అవార్డు ప్రకటించింది.

మద్యం మహమ్మారి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోంది.. కుటుంబ విలువల పతనానికి ఎలా కారణమవుతుందనే విషయాన్ని శ్రీధర్​ అద్భుతంగా వర్ణించాడు. దీనిపై మహిళలందరూ సంఘటితంగా పోరాడిన తీరు నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి కథనాలు సమాజంలో మార్పునకు నాంది పలుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా V6 యాజమాన్యం, సిబ్బంది శ్రీధర్​కు అభినందనలు తెలిపారు.