
- ‘వెలుగు’ ఎఫెక్ట్రిపేర్లు చేపిస్తున్న అధికారులు
కాగజ్ నగర్, వెలుగు : ఆరు నెలలుగా ములకుపడిన ఫారెస్ట్ జీప్‌కు డీజిల్ సహా మిగిలిన అలవెన్సులను అధికారులు డ్రా చేసిన విషయంపై ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన వార్తపై అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు జీప్ లొకేషన్‌ను ఛేంజ్ చేశారు. ఇదివరకు రూరల్ పోలీస్ స్టేషన్ ముందున్న చెక్ పోస్ట్ పక్కన నిలిపి ఉంచిన జీప్ ను ఆగమేఘాల మీద ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్‌కు తరలించారు.
అక్కడ ఉన్న ఎఫ్‌డీవో రెసిడెంట్ క్వార్టర్ ముందు నిలిపి దాని ఇంజిన్ విప్పి గ్యారేజ్‌లో రిపేర్ చేయిస్తున్నారు. మూలకు పడిన ఆ వెహికల్ మీద నెలల పాటు బిల్లులు డ్రా చేసిన అధికారులు.. ఇప్పుడు మాత్రం అదేమీ లేదని, జీప్‌కు మైనర్ రిపేర్ మాత్రమే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.