జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఓ మహిళ V6 వెలుగు అని బంతి పూలతో తీర్చిదిద్దింది. చుట్టూ దీపాల మధ్యలో V6 వెలుగు వెలిగిపోతుండడం అందరినీ ఆకట్టుకుంది. V6 వెలుగు ప్రజల పక్షాన నిలుస్తూ..ప్రజా సమస్యలపై పోరాడుతోందని..అందుకే దీపావళి రోజు ప్రత్యేకంగా ఈ ఆర్ట్ వేసినట్లు సదరు మహిళ తెలిపింది.