- ఇద్దరు డైరెక్టర్ల ఎక్స్‌టెన్షన్‌పై నో పర్మిషన్
- గత నెలతో పూర్తయిన రెండేండ్ల పొడిగింపు
- వీఆర్ఎస్తీసుకునే ఆలోచనలో ఒకరు
- డైరెక్టర్ రేసులో దుర్గం రాంచందర్?
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్‌లో ఇద్దరు డైరెక్టర్ల ఎక్స్‌టెన్షన్‌పై ఉత్కంఠ నెలకొంది. మేనేజ్ మెంట్ నుంచి పర్మిషన్ రాకపోవడంతో మూడు డైరెక్టర్ల పోస్టులు ఖాళీ అవుతాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ ప్లానింగ్డైరెక్టర్ సీటు ఖాళీగా ఉంది. పాగా ఇన్ చార్జ్ డైరెక్టర్జి. వెంకటేశ్వరరెడ్డి, ఆపరేషన్స్డైరెక్టర్ఎన్వీకే శ్రీనివాస్ బాధ్యతల్లో ఉండగా.. వీరి రెండేండ్ల కాలపరిమితి గత నెలతో ముగిసింది.
ఎక్స్ టెన్షన్వస్తుందేమోనని శుక్రవా రం అర్ధరాత్రి దాకా ఎదురు చూసినా ఎలాంటి ఆర్డర్రాలేదు. దీంతో పాగా ఇన్ చార్జ్ డైరెక్టర్ జి. వెంకటేశ్వర రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఇదిలా ఉండగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి కీలకమైనవి. ఇలాంటి సమయంలో ఇద్దరు డైరెక్టర్లకు ఎక్స్టెన్షన్రాకపోవడంతో సీఎండీపై ఒత్తిడి పడే చాన్స్ ఉందని కార్మికులు పేర్కొంటున్నారు.
వీఆర్ఎస్ తీసుకునేందుకు..
ఆపరేషన్స్డైరెక్టర్ఎన్వీకే శ్రీనివాస్‌కు గతంలోనే మేనేజ్ మెంట్ పాగా డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇంతకుముందే పలు కారణాలతో ఆయనను సింగరేణి అనధికారికంగా ఆదేశించడంతో లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోయారు. మరో ఐదారు నెలల్లో వెంకటేశ్వరరెడ్డి రిటైర్అవుతుండగా.. ఇప్పటివరకు జీఎంలపై డైరెక్టర్ గా పర్యవేక్షణ చేసిన ఆయనకు ఎక్స్ టెన్షన్రాకపోవడంతో జీఎంగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అటు వెళ్లడం ఇష్టంలేక వీఆర్ఎస్పెట్టే ఆలోచనలో ఉన్నారు. మరో వైపు లాంగ్ లీవ్‌లో ఉన్న డైరెక్టర్‌శ్రీనివాస్ ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు.
కాగా.. ఆయనకు సింగరేణి భవన్ లో మంచి హోదాతో పదవి వచ్చేలా మేనేజ్ మెంట్ చర్యలు చేపట్టిందనే ప్రచారం నడుస్తోంది. మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌కు ఆపరేషన్స్ డైరెక్టర్‌కానీ, పాగా డైరెక్టర్‌నైనా బాధ్యతలు ఇచ్చే చాన్స్ ఉందని, ఇప్పటికే ఆర్డర్ రెడీ అయిందని హెడ్డాఫీస్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్అమలులోకి రావడంతో డైరెక్టర్ల ఎక్స్టెన్షన్, కొత్తగా రిక్రూట్ పై సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననేది చర్చనీయాంశమైంది.