రేపే వ్యాక్సినేషన్ షురూ.. ఎవరు వేసుకోవచ్చు? ఎవరు వేసుకోకూడదు?

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం పభుత్వం దేశవ్యాప్తంగా రేపటినుంచి వ్యాక్పినేషన్ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చాలామంది కరోనా వ్యాక్సిన్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు అనే సందేహాలు లేవనెత్తుతున్నారు. చిన్పపిల్లలకు, బాలింతలకు టీకాలు ఇవ్వబోమని ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజలలో వస్తున్న పలు సందేహాలకు నిపుణుల సమాధానాలు మీకోసం..

ఏ వయసువారైనా టీకా వేసుకోవచ్చా?

18 ఏండ్లలోపువారిపై వైరస్‌ ప్రభావం తక్కువ. కాబట్టి టీకాలు అవసరం లేదు. ఆపై వయసున్న ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం 18-50 ఏండ్ల మధ్య వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు.

టీకాను ఎంత ఉష్ణోగ్రతలో నిల్వచేస్తారు?

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ సాధారణ ఫ్రిజ్‌ టెంపరేచర్‌ (2 నుంచి 8 డిగ్రీలు) వద్ద నిల్వ చేయవచ్చు. సాధారణ వ్యాక్సిన్ల మాదిరిగానే రవాణా, నిల్వ చేస్తారు.

గతంలో కరోనా సోకినవారు టీకా వేసుకోవాలా?

కరోనా నుంచి కోలుకున్నవారు 90 రోజులపాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్‌ సోకకుండా అడ్డుకుంటాయి. కనుక టీకా వేసుకోవాలో వద్దో వారే నిర్ణయించుకోవాలి.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

ఇప్పటికే అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఔషధ నియంత్రణ మండలి, డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే టీకా వినియోగానికి అనుమతి ఇచ్చాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు టీకా వేసుకోవచ్చా?

జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా టీకా వేస్తారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్నవారికి ఎప్పటికీ టీకా వేయరు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను విడుదల చేసే సమయంలో పూర్తి మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి.

కరోనా రోగులకే టీకా వేస్తారా?

ఇది నిజం కాదు. కరోనా సోకకుండా అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. కాబ్టటి వైరస్‌ సోకిన రోగులకు టీకా వేయరు.

For More News..

నల్గొండలో దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు

ట్రక్కు, టెంపో ఢీ.. 11 మంది మృతి

బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే