హైదరాబాద్ లో​ వ్యాక్సిన్ వెహికల్స్ ప్రారంభం

హైదరాబాద్ లో​ వ్యాక్సిన్ వెహికల్స్ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్​పూర్తిచేయడమే లక్ష్యంగా వ్యాక్సిన్ వెహికల్స్ ను ప్రారంభించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. జిల్లాలో రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్స్ నిర్వహించడానికి, ఇరుకు గల్లీలను ఈజీగా చేరుకోవడానికి ఏఎన్ఎంలకు నాలుగు వ్యాక్సిన్ వెహికల్స్ కేటాయించినట్లు చెప్పారు. శనివారం సికింద్రాబాద్​లోని ఆఫీసులో జెండా ఊపి వాటిని ప్రారంభించారు.

ఖైరతాబాద్, మెట్టుగూడ, శ్రీరామ్‌‌నగర్, సనత్ నగర్ యూపీహెచ్​సీలకు వెహికల్స్​కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, మాస్ ఎడ్యుకేషన్, మీడియా అధికారి జక్కుల రాములు పాల్గొన్నారు.