
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు జిల్లా వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం రామగుండంలో జరిగిన మీటింగ్లో తెలంగాణ వడ్డెర సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా మీటింగ్ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు.