ఓటీటీ(OTT)ల జమానా మొదలయ్యాక వెబ్ సిరీస్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దర్శకులు తాము చెప్పాలనుకున్న పాయింట్స్ ను ఇంకాస్త క్లియర్ గా చెప్పే అవకాశం దక్కుతుంది ఈ వెబ్ సిరీస్ ల వల్ల. అందులోనూ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లంటే తెగ ఇష్టపడుతున్నారు ఆడియన్స్. దీంతో.. ఇలాంటివి చేయడానికి మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ప్రతీ వారం ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ వదంతి.
ఎస్జే సూర్య, లైలా, సంజనా కృష్ణమూర్తి, నాజర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు ఆండ్రూ లూయిస్ తెరకెక్కించారు. క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ 2022 డిసెంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సిరీస్ లో వచ్చే ట్విస్టులకు, థ్రిల్లింగ్ మూమెంట్స్ కు ఆడియన్స్ ఫుల్లుగా ఎగ్జైట్ అయ్యారు.
దీంతో ఆ సిరీస్ ను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ఎంచుకున్న పాయింట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక్కో ట్విస్ట్, ఆ ట్విస్టులను రివీల్ చేసిన విధానం కూడా అద్భుతంగా సెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సస్ట్రీమింగ్ అవుతోంది. వీలుంటే మీరు కుంటే మీకు కూడా చూసేయండి.