హీరో సూర్య, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వాడివాసల్ సినిమా రాబోతోంది. అయితే, ఈమధ్య ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణం పనులు ఆగిపోయిట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర బృందం ఆ వార్త నిజం కాదని, సినిమా చిత్రీకరణ జరుగుతుందని ప్రకటించింది. ఇటీవలే సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు సినిమా ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆగిపోయిన విషయం తెలిసిందే.
సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్తలు నమ్మొద్దని నిర్మాత ఎస్. థాను స్పష్టం చేశాడు. సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని థాను వెల్లడించారు. ఫేమ్ పొందడానికి కొందరు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తుంటారని, అభిమానులు వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అందులో ఇప్పుడు మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.