
పెద్దశంకరంపేట, వెలుగు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సీటులోనే గుండెపోటు వచ్చి చనిపోయిన ఘటన శనివారం మెదక్జిల్లా పెద్ద శంకరంపేట మం డల పరిధిలోని కోలపల్లి శివారులో జరిగింది. నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య (52) కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సీట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలియగానే డ్రైవర్ బస్సును నిలిపివేసి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.