![మహబూబాబాద్ ఎంపీ టికెట్ వెంకన్నకు ఇవ్వాలి : వాగబోయిన చంద్రయ్య దొర](https://static.v6velugu.com/uploads/2024/02/vagaboina-chandraya-dora-demanded-to-give-mahabubabad-mp-ticket-to-venkanna_ywHQdAPzah.jpg)
గుండాల, వెలుగు: మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ యట్టి వెంకన్నకు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ వాగబోయిన చంద్రయ్య దొర డిమాండ్చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబాద్ పార్లమెంట్ టికెట్ ను మూడు దశాబ్దాలుగా ఒకే తెగకు చెందిన లంబాడీలకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీలకు ఇవ్వాల్సిందేనని కోరారు. మహబూబాద్ఎంపీ సెగ్మెంట్లో 5,71,215 మంది ఆదివాసీ ఓటర్లున్నట్లు గుర్తు చేశారు.