జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన వాగ్దేవి స్టూడెంట్స్

జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన వాగ్దేవి స్టూడెంట్స్

మహబూబ్ నగర్, వెలుగు: నేషనల్  టెస్టింగ్  ఏజెన్సీ జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్  పరీక్ష ఫలితాల్లో మహబూబ్ నగర్ లోని వాగ్దేవి జూనియర్  కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. రేవంత్ రెడ్డి 97.27 శాతం, నవనీత్ గౌడ్ 90 శాతం సాధించారు.

వీరితో పాటు నవీన్, అశ్విని, రామ్ చరణ్, జునేత్, ఓంకార్, ఆర్తి , సురేశ్ నాయక్, కస్తూరి, శివ, ప్రభాస్, గోవింద్  అత్యుత్తమ పర్సంటేజ్  సాధించి అడ్వాన్స్ కు ఎంపికయ్యారు. వీరిని కాలేజీ కరస్పాండెంట్  విజేత వెంకట్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్  అకాడమీ ఇన్​చార్జి పావని రెడ్డి, ప్రిన్సిపాల్  గీతాదేవి, లెక్చరర్లు రాఘవేంద్రరావు, షాకీర్, యాకూబ్, సందీప్, గోవిందరాజులు, రాంరెడ్డి, మహేశ్   పాల్గొన్నారు.