వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
  •     జనవరి 9న తెప్పోత్సవం...10న వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం
  •     షెడ్యూల్​ రిలీజ్​ చేసిన వైదిక కమిటీ

భద్రాచలం,వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల షెడ్యూల్​ను శుక్రవారంవైదిక కమిటీ ప్రకటించింది.  డిసెంబర్​ 31వ తేదీ నుంచి2025 జనవరి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 

ఒక్కో రోజు ఒక్కో రూపంలో.. 

పగల్​పత్​ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్​ 31న మత్స్య, జనవరి 1న కూర్మా,  2న వరాహ, 3న నరసింహా, 4న వామనా, 5న పరశురామా, 6నశ్రీరామ, 7న బలరామా, 8న శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం ఇవ్వనున్నారు. 9న తిరుంగై ఆళ్వార్​ పరమపదోత్సవం, సాయంత్రం గోదావరిలో హంసవాహనంలో సీతారాములకు తెప్పోత్సవం, 10న తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో వైకుంఠ ద్వారదర్శనం నిర్వహించాలని వైదిక కమిటీ పేర్కొంది. 

జనవరి 10వ తేదీ నుంచి రాపత్​ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10న డీఎస్పీ బంగ్లాలో, 11న కూడారై పాశురోత్సవం, రాత్రి అంబసత్రంలో, 12న అభయాంజనేయస్వామి ఆలయంలో, 13న గోవిందరాజస్వామి గుడి తాతగుడి సెంటర్లో, 14న ఆలయంలో సీతారాములకు రథోత్సవం, 15న పునర్వసు మండప సేవ, పట్టాభిషేకం, 16న శ్రీకృష్ణాలయం గోవులమండపంలో, 17న విశ్రాంతి మండపంలో, 18న వనవిహారం వేస్ట్ ల్యాండ్​లో

19న చిత్రకూట మండపంలో, 20న రెవిన్యూ శాఖ శ్రీరామదాసు మండపంలో రాపత్​ సేవలను సీతారాములు అందుకోనున్నారు. 21వ తేదీ నుంచి విలాసోత్సవాలు 21న గ్రామపంచాయతీ ఆఫీసులో, 22న దసరా మండపంలో, 23న వశిష్ట మండంలో నిర్వహించనున్నారు. 26న అందరు దేవుళ్లు ఒకే చోట కొలువయ్యే విశ్వరూప సేవను అంగరంగ వైభవంగా చేయనున్నారు.