నయనానందకరం.. ఉత్తర ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి, కొండగట్టులో ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. యాదగిరీశుడిని గరుడ వాహనంపై ఉత్తర రాజగోపుర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి ఉత్తర ద్వారదర్శనం కల్పించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు.

భద్రాచలంలో ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. తర్వాత గరుడ వాహనంపై శ్రీరాముడు, గజవాహనంపై సీతమ్మవారిని ఉంచి తిరువీధి సేవ నిర్వహించారు.