- ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
వెలుగు, నెట్వర్క్ : ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాతం, మహా మంగళహారతి సేవలు నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం గుండా వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మందమర్రి లో పూజలు చేసిన కలెక్టర్, సీపీ, సింగరేణి జీఎం దంపతులు..
మందమర్రి వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకల్లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు, రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీసీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు,మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, ఎస్వోటుజీఎం విజయప్రసాద్, మందమర్రి సీఐ శశీధర్‌రెడ్డి, మందమర్రి, రామకృష్ణాపూర్ ఎస్సైలు రాజశేఖర్ దంపతులు పాల్గొని పూజలు చేశారు.