ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​

 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​
  • ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​

జూలూరుపాడు, వెలుగు : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాందాస్ ​నాయక్​ అన్నారు. మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 13 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 14 మందికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను పక్కాగా అమలు  చేస్తున్నామన్నారు. 

మండల కేంద్రంలో బస్​ సెల్టర్​ లేక ప్రయాణికులు ఇబ్బదులు పడుతున్నారని, టాయిలెట్స్​కట్టించాలని, శాశ్వత మార్కెట్​నిర్మాణం చేపట్టాలని పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తేగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​ స్వాతిబింధు, ఇన్​చార్జ్​ ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎస్సై రాణా ప్రతాప్, మండల కాంగ్రెస్​అధ్యక్షుడు మంగీలాల్, లేళ్ల వెంకటరెడ్డి, మధుసూదన్ రావు పాల్గొన్నారు.

వైరా : వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 34 మందికి రూ.14 లక్షల సీఎంఆర్​ఎఫ్​  చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, మాజీ మార్క్ ఫైడ్  వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి,  పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, నాయకులు పాల్గొన్నారు. 

పెద్దమ్మ తల్లి గుడి అభివృద్ధికి కృషి చేస్తా 

కారేపల్లి : మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. పెద్దమ్మ తల్లి దేవాలయానికి ప్రభుత్వం నుంచి ధూప దీప నైవేద్యం స్కీమును మంజూరు చేయించాలని కోరుతూ కారేపల్లి గ్రామస్తులు మంగళవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం సమర్పించారు.