- ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా, వెలుగు : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ఆదివారం వైరా క్యాంపు ఆఫీసులో రూ.80 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి కార్యక్రమాలతో రైతులకు ప్రభుత్వం చేరువైందన్నారు. భూ భారతితో భూ సమస్యలు తీరనున్నాయన్నారు. నియోజకవర్గంలో లింకు రోడ్ల పనులు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి లోపు అర్హులైన వారికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ, తెల్లారి చంద్ర ప్రకాశ్, మంగీలాల్, స్వర్ణ నరేందర్, వైరా పట్టణ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, నాయకులు దొడ్డ పుల్లయ్య, పమ్మి అశోక్ , నరవనేని అశోక్, పొదిలి హరినాథ్, మట్టూరి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సెమీ క్రిస్మస్
జూలూరుపాడు: మండల కేంద్రంలోని ఆర్ కే ఫంక్షన్ హాల్ లో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు క్రీస్తు మార్గంతో శాంతి యుతంగా జీవించాలని ఆయన సూచించారు. అంతకుముందు గుండెపుడి గ్రామంలో ఏర్పాటు చేసిన చక్ర సిద్ధ ఉచిత చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ స్వాతిబిందు, ఎస్సై రవి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు వెంకట రెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్, కాళ్లూరి వెంకటేశ్వర్లు, జగదీష్, మండల పాస్టర్లు కబీర్ దాస్, నతానియేల్ రాజ్, శుభాకర్, నిరీక్షణ కుమార్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.