
- ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కారేపల్లి, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. మండలంలోని రొట్టమాకు రేవు రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధరణితో రైతులు పడే కష్టాలకు ప్రభుత్వం స్వస్తి పలికిందని, భూ సమస్యలు సులువుగా పరిష్కారమయ్యేలా భూ భారతి ఏర్పడిందని తెలిపారు. అనంతరం పేరుపల్లి గురవమ్మ జాతరను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు తలారి చంద్రప్రకాశ్, పగడాల మంజుల, బానోత్ రామ్మూర్తి, సురేందర్ మనియార్, అడ్డగోడ ఐలయ్య, ఇమ్మడి తిరుపతిరావు పాల్గొన్నారు.