సదాశివనగర్, వెలుగు : శ్రీ కాల భైరవ స్వామి ఆలయంలో మంగళవారం నుంచి వైశాఖ మాస ప్రత్యేక పూజలు ప్రారంభించినట్లు ఆలయ ఈవో రాంచంద్ర ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి స్వామి వారిని వివిధ రకాల పండ్లతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం భక్తులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు గంటల పాటు అభిషేకాలు, పూజలు చేసి నైవైద్యం సమర్పించారు.
పూజల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. వైశాఖ మాసం సందర్భంగా ఆలయంలో రోజూ పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అందించిన డబ్బులను దండల రూపంలో తయారు చేసి స్వామి వారి మెడలో వేశామన్నారు.
కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సురేందర్, ఆలయ మాజీ చైర్మన్గంజీ సతీశ్గుప్తా, మాజీ సర్పంచ్ పడిగెల శైలజ శ్రీనివాస్‌గుప్తా, మాజీ డైరెక్టర్ అబ్బగోని రాజేందర్‌గౌడ్, నాగరాజు, అర్చకుడు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.