
ఇండస్ట్రీ రాగానే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన హీరోయిన్లలో బేబీ మూవీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒకరు. సినిమాల్లోకి రాకముందు వైష్ణవి చైతన్య పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు సినిమాల్లో కూడా చిన్నాచితకా పాత్రలు చేస్తూ అలరించింది. కానీ బేబీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వైష్ణవి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య తెలుగులో "జాక్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
జాక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులోభాగంగా ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి థాంక్స్ తెలిపింది. చిన్నప్పటినుంచి తన డైరెక్టర్ భాస్కర్ సినిమాలు చూస్తూ.. ఆయన సినిమాల్లోని పాటలు వింటూ పెరిగానని అలాంటిది ఈరోజు ఏకంగా భాస్కర్ సినిమాలో నటించే అఫర్ దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
Also Read:-బన్నీ కోసం హాలీవుడ్ బ్యూటీ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఒప్పుకుంటుందా..?
ఇక స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ గురించి మాట్లాడుతూ సిద్దూ తనని చాలా సపోర్ట్ చేశాడని తెలిపింది. అలాగే సిద్దూ సినిమా సెట్స్ కి వచ్చేప్పుడు తనతోపాటూ జోష్ ని కూడా తెస్తాడని దీంతో షూటింగులో ఫుల్ ఫన్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక నటన పరంగా సిద్దూ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నని "హీ ఈజ్ రియల్లీ గ్రేట్ యాక్టర్ " కితాబిచ్చింది. జాక్ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రానుందని కచ్చితంగా ప్రతీఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరింది.
ఈ విషయం ఇలా ఉండగా జాక్ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో వైష్ణవి తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించగా సిద్దూ జొన్నలగడ్డ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. మంచి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తో కట్ చేసిన ట్రైలర్ మాత్రం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. మరి థియేటర్స్ లో జాక్ ఎలా అలరిస్తాడో చూడాలి..