ఘనంగా వాజ్​పేయీ శత జయంతి ఉత్సవాలు

ఘనంగా వాజ్​పేయీ శత జయంతి ఉత్సవాలు

జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్​పేయీ100వ  జయంతి సందర్భంగా బుధవారం బంజారాహిల్స్ లోని బసవ తారకం క్యాన్సర్​హాస్పిటల్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి క్యాన్సర్​తో బాధపడుతున్న చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు బంగారు శృతి, డాక్టర్​గౌతమ్​ రావు, పెద్దిరెడ్డి, ప్రేమ్​సింగ్​రాథోడ్, ప్రేమ్​రాజ్, భోజిరెడ్డి, వెంకటస్వామి, రామ్మోహన్, బంగారం చంద్రశేఖర్​ఉన్నారు. అలాగే అటల్ బిహారి వాజ్​పేయీ శతజయంతి సందర్భంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అనంతరం బీజేపీ స్టేట్​ఆఫీస్​నుంచి మొదలైన వాజ్​పేయీ శతజయంతి ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.