రివ్యూ: వకీల్ సాబ్

నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు
దర్శకత్వం : శ్రీరామ్ వేణు‌
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌
సంగీతం : ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ : పి.ఎస్‌.వినోద్
ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి
విడుదల తేదీ: 9 ఏప్రిల్ 2021

కథ : జరీనా (అంజలి) పల్లవి (నివేదా థామస్) అనన్య (అనన్య) స్నేహితులు. మిడిల్ క్లాస్ అమ్మాయిలైన ఈ ముగ్గురు హైదరాబాద్ లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు.అయితే ఓ రాత్రి కారు లిప్టు అడగాల్సి వస్తుంది..అనుకోకుండా ఆ కారులో కొందరు అబ్బాయిలతో రిసార్ట్ కు వెళ్తారు.అక్కడ జరిగిన సంఘటలతో..ఈ అమ్మాయిలు కోర్టుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తుంది.దాంతో వకీల్ సాబ్ (పవన్ కళ్యాణ్) వీళ్ళ కేసును వాదిస్తాడు.మరి చివరికి వకీల్ సాబ్ ..ఈ అమ్మాయిలకు గెలిపించాడా ? లేదా అన్నదే స్టోరీ

నటీనటుల పర్ఫార్మెన్స్:

గ్యాప్ తర్వాత వెండితెర మీదికి వచ్చిన పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ గా రెచ్చిపోయాడు.ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు.కోర్టు సీన్లలో వాదోపవాదనలు ..అలాగే ఇతర సన్నివేశాలలో రాజకీయ పరమైన పంచులతో రంజింప చేసాడు. ప్రకాష్ రాజ్.. మరో లాయర్ గా నందా పాత్రలో పవన్ కు సవాల్ విసిరేల నటించాడు.నివేదా థామస్ మరోసారి మంచి నటన ప్రదర్శించింది.అంజలి కూడా ప్రతిభ చాటుకుంది.అనన్య అమాయకమైన చూపులతో ఆకట్టుకుంది.

టెక్నికల్ వర్క్:

ఈ సినిమాకు సాంకేతికంగా అతి పెద్ద బలం తమన్ సంగీతం.పాటలు మంచి హిట్టయ్యాయి.ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు మరింత ఊపిరి తీసుకొచ్చాడు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ కూడా విజువల్ గా ఆకట్టుకుంది.ఎడిటర్ కూడా పనితనం చూపించాడు.దర్శకుడిగా వేణు శ్రీరాం టాలెంట్ ప్రదర్శించాడు.కథనాన్ని మెప్పించేల తెరకెక్కించాడు. సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేసాడు. మూవీ స్టోరీకి తగ్గట్టుగా అలాగే ఫ్యాన్స్ ను అలరించేల డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

విశ్లేషణ:

స్టోరీ సెటప్ అండ్ ట్రీట్మెంట్ బాగున్నా.. ప్లాష్ బ్యాక్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా రేంజ్ ను తగ్గిచ్చేదిలా ఉంది.ఇంట్రస్టింగ్ గా సాగుతున్న కథనాన్ని ఇబ్బంది పెట్టేలా సాగింది.ఈ ఫ్లాష్ బ్యాక్ లో శృతి హాసన్ లుక్స్ తో ఆకట్టుకోలేకపోయింది.ఇక సెకండ్ ఆఫ్ లో కోర్టు సీన్స్ ..ప్ర్రేక్షకులను కట్టి పడేస్తాయి.పవన్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య నడిచే వాదనాలు ఆకట్టుకుంటాయి.మధ్యలో అభిమానుల కోసం వకీల్ సాబ్ ఫైట్స్ చేసిన..కథకు అడ్డొచ్చేలా ఉన్నాయి.మొత్తానికి ఈ వకీల్ సాబ్  పవర్ స్టార్ కు మంచి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పాలి.మెసేజ్ స్టోరీ తో పాటు..ఫ్యాన్స్ ఆకట్టుకునేల ప్రయత్నించి..సఫలం అయ్యాడు.అమ్మాయిలను గెలిపించి..తాను కూడా గెలిచాడు.కమర్షియల్ గా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది.

బాటమ్ లైన్: వసూల్ సాబ్