ఆంధ్ర మహాసభల్లో కీలక భూమిక పోషించిన వకీల్ భూమారెడ్డి

కామారెడ్డి, వెలుగు: నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి  కోసం జరిగిన  సాయుధ పోరాటంలో కామారెడ్డి ఏరియాకు చెందిన వకీల్ భూమారెడ్డి, పణిహారం రంగాచారి పాత్ర ప్రముఖమైంది. ప్రజలను చైతన్య పరిచి.. ఉద్యమాలకు సన్నద్ధం చేయడానికి వీరు ఎంతో కృషి చేశారు.   

పణిహారం రంగాచారి..

చిత్రకారుడైన పణిహరం రంగాచారి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పనిచేశారు. ఇక్కడే మిడిల్​ చదువు అనంతరం హైదరాబాద్‌‌‌‌కు వెళ్లారు. రంగాచారికి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌‌‌‌ అంటే ఇష్టం ఉండేది.   డ్రాయింగ్​టీచర్​ప్రోత్సహంతో  అందులో మరింతగా రాణించారు.  హైదరాబాద్‌‌‌‌లో ఉంటూ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. రజాకార్ల ఆరచకాలు, నిజాం నిరంకుశత్వంపై ఫొటోలు గీస్తూ ప్రజల్ని జాగృతం చేయడంతో పాటు పోరాటంలో కూడా పాల్గొన్నారు.   సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు పలువురు ముఖ్యులు అరెస్టు కాకుండా ఈయన వారిని తప్పించడంతో  కీలకంగా పని చేసినట్లు చెబుతుంటారు.

వకీల్ భూమారెడ్డి..  

తెలంగాణ ఉద్యమానికి ఊరిరిలూదిన ఆంధ్ర మహాసభలో  వకీల్​భూమారెడ్డి చురుగ్గా పని చేశారు. ప్రస్తుత దోమకొండ మండలం అంబారీపేటకు చెందిన ఆయన కామారెడ్డి కోర్టులో ప్రాక్టీస్​చేసే వారు. ఆయన ఆంధ్ర మహాసభ స్థాయి సభ్యుడిగా పని చేశారు. ఈయన భార్య సత్యవతి కూడా మహిళా మహాసభ ప్రెసిడెంట్‌‌‌‌గా పని చేశారు. వారిద్దరూ కామారెడ్డి ఏరియాలోని ఊర్లలో తిరుగుతూ నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి ప్రజలకు వివరించే వారు. వీరికి కామారెడ్డికి చెందిన కలకుంట శివరాజయ్య,  మాచారెడ్డికి చెందిన జనపాల రఘురాములు సహకరించే వారు. 1940లో  వకీల్ భూమారెడ్డి చనిపోయారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. భార్య సత్యవతి పిల్లలను చదివించారు. పెద్ద కొడుకు  బీపీ జీవన్‌‌‌‌రెడ్డి ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు. రెండు సార్లు లా కమిషన్​ చైర్మన్‌‌‌‌గా కొనసాగారు.