Valentine's Day Special: నిజమైన ప్రేమ అంటే ఏంటీ..స్వేచ్ఛనా..హక్కునా..నమ్మకమా..?

Valentine's Day Special: నిజమైన ప్రేమ అంటే ఏంటీ..స్వేచ్ఛనా..హక్కునా..నమ్మకమా..?

హలో లేడీస్ అండ్ జెంటిల్ మెన్ హ్యాపీ వాలంటైన్స్ డే...ఒక చిన్న ప్రశ్న..'ప్రేమంటే ఏంటి  ఇదేం ప్రశ్న అంటున్నారా! అయినా పర్లేదు 'అసలు ప్రేమంటే ఏంటి? ప్రేమంటే...ప్రేమంటే...."ఏంటి ఆగిపోయారు?" చెప్పలేం' అంటారా! నిజానికి ఈ క్వశ్చన్ కి పర్పెక్ట్ ఆన్సర్ ఇదే అని మీరే కాదు... ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక్కొక్కరి ప్రేమ ఒక్కోలా ఉంటుంది. ప్రేమలో ఒక్కొక్కరి అనుభూతులు ఒక్కోలా ఉంటాయి. ఆ ఎక్స్పీరియెన్స్లని బట్టి 'ప్రేమంటే ఇదే' అని ఒక అంచనాకి వస్తుంటారు చాలామంది. 

నిజానికి ప్రేమంటే ఏంటి? 

  • ప్రేమించిన మనిషి దూరమైతే ప్రేమని నిందించడం ఎంత వరకు కరెక్ట్? 

ఇష్టాయిష్టాలని కనిపెట్టుకుని మెలగడాన్నే ప్రేమంటారు కొందరు. కష్టసుఖాల్లో తోడుండటాన్ని ప్రేమంటారు ఇంకొందరు. ప్రతి అడుగులోనూ తోడుండటాన్ని ప్రేమగా చెప్తుంటారు. మరికొందరు. అయితే వీటన్నింటి కన్నా 'స్వేచ్ఛ' ముందుంటుంది ప్రేమలో మన అభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు ఒకరి దగ్గర స్వేచ్చగా చెప్పుకోగలిగే చనువు ఉన్నప్పుడే అది నిజమైన ప్రేమ. మరి ఆ స్వేచ్ఛ ఎంతమంది పార్టనర్స్ మధ్య ఉందో ఆలోచించాల్సిన విషయమే..

స్వేచ్ఛ కావాలి 

నువ్వు ఇది చెయ్యి'.. ఇలా నడుచుకో'. అలా మాట్లాడు. జనరేషన్ ఏదైనా సరే పార్టనర్స్ మధ్య వాదులాటకి ఎక్కువగా ఇవే కారణాలు అవుతాయి. ఇక ప్రజెంట్ జనరేషన్లో అయితే ఈ రిస్ట్రిక్షన్స్ లిస్ట్ ఇంకాస్త పెరుగుతూ పోతోంది. అయితే మనకి నచ్చిన వ్యక్తి దగ్గర మనం మనలా ఉండే.. మనలా మనం మాట్లాడే, నడుచుకునే స్వేచ్ఛ లేకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది. మన పార్టనర్స్ మనలానే ఆలోచించాలి. మన మనస్తత్వానికి తగ్గట్టు నడుచుకోవాలి అనుకునే స్వభావం ఎందుకు? ఎక్కడ? మొదలవుతుంది. 

ప్రేమంటే హక్కు కాదు.. 

ప్రేమని ఒక అధికారంలా ఫీలవ్వడం వల్ల ప్రేమలో స్వేచ్ఛ మాయమవుతోంది. చాలామంది ప్రేమించిన వ్యక్తిపై అన్ని హక్కులూ తమకున్నాయి అనుకుంటున్నారు. ఆ ఎఫెక్ట్ ప్రేమించిన వ్యక్తి లైఫ్ స్టయిల్, ఫ్రెండ్ సర్కిల్, హ్యాబిట్స్, ఇష్టాలు, అయిష్టాలపైనా పడుతుంది. దాంతో తమకి నచ్చినట్టుగా తమ లవ్ లేదా మ్యారేజ్ లైఫ్ ఉండలేకపోతున్నారు చాలామంది. అఫ్కోర్స్ నచ్చిన మనిషి కోసం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడంలో తప్పులేదు. కానీ, మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్. పార్ట్ నర్ నాకు నచ్చినట్టుగా నడుచుకోవాలని ఎక్సపెక్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అసలు ఎక్సపెక్టేషన్స్ ఏవీ లేకపోతే ఆల్ హ్యాపీసేకదా! 

నమ్మకమే పునాది 

స్వేచ్ఛతో పాటు నమ్మకం, భరోసా కూడా ప్రేమకి బలమైన పునాదులు. ఇవి లేని చోట మనసులో ఎన్ని మేడలు కట్టినా అవి పేకమేడల్లా కూలిపోతాయి. బంధం బలహీన పడుతుంది. ఏ రిలేషన్ అయినా లైఫ్ లాంగ్ హ్యాపీగా సాగిపోవాలంటే పార్టనర్పై నమ్మకం భరోసా ఉండాల్సిందే. అందుకే ఈ వాలంటైన్స్ డేకి మీ పార్టనర్కి నమ్మకం, భరోసా, స్వేచ్ఛల్ని గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది. ఓ సారి ఇచ్చి చూడండి. 

ప్రేమదేం తప్పు? 

ఏవేవో కారణాల వల్ల పార్టనర్‌‌తో బ్రేకప్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తుల్ని పక్కనపెట్టి ప్రేమని తిట్టిపోస్తుంటారు కొందరు.. అంతేనా ప్రేమ పేరు చెప్తేనే గుర్రున చూస్తుంటారు. అసలు ప్రేమే లేదంటూ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. కానీ, అక్కడ తప్పు ప్రేమది కాదు. ప్రేమించిన వ్యక్తులు, ఎదురైన పరిస్థితులది. కొన్ని సార్లు ఆ బ్రేకప్‌కి మీ బిహేవియర్ కూడా కారణం అయ్యిండొచ్చు. అవన్నీ పక్కనపెట్టి ప్రేమను దోషిగా చేయడం ఎంత వరకు కరెక్ట్. ప్రేమ లేదంటూ ఆ బ్యూటిఫుల్ రిలేషన్కి  సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా అందుకే ప్రేమకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి.

-V6 వెలుగు