Valentine's Day: ప్రేమికుల రోజున.. అమ్మాయిలే అబ్బాయిలకు బహుమతులు ఇస్తారు.. ఎక్కడో తెలుసా..!

Valentine's Day: ప్రేమికుల రోజున.. అమ్మాయిలే అబ్బాయిలకు బహుమతులు ఇస్తారు.. ఎక్కడో తెలుసా..!

ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉండవు. ఒక్కో దేశంలో ఒక్కోలాగా జరుపుకుంటారు. అవేంటో చుద్దాం.. జపాన్‌లో ఫిబ్రవరి 14న అమ్మాయిలే అబ్బాయిలకు గిఫ్టులిస్తారు. మళ్లీ మార్చి 14న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చనివి తిరిగివ్వాలి. దీన్ని 'వైట్ డే' అంటారు. 

ఇంగ్లాండ్‌లో జాక్ వాలెంటైన్ వేషంలో చిన్నారులకు గిఫ్టులు పంచుతారు.  దక్షిణాఫ్రికాలో నచ్చిన వ్యక్తుల పేర్లను భుజాలపై హార్ట్ షేపులో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. బ్రెజిల్‌లో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 కాదు జూన్ 12. ఈ రోజును 'సెయింట్ ఆంటోనీస్' పేరుతో ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. 

ALSO READ | మందు బాబులకు అలర్ట్: ఎండల్లో కూల్ బీరు వేస్తున్నారా.. ఆరోగ్యం దొబ్బుద్ది అంట.. నిజం తెలుసుకోండి..!

ఇక సౌదీ అయితే ఏకంగా జైలుకే. ఆరోజు ఎర్ర గులాబీ పట్టుకున్నా.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. మన దేశంలో ప్రేమికుల దినోత్సవం రోజున నచ్చిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ప్రేమికుల రోజును వ్యతిరేకించే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా వాలెంటైన్స్ డేను కొంతమంది వ్యతిరేకిస్తారు. అక్కడ కొన్ని నగరాల్లో దీనిని అధికారికంగానే నిషేధించారు. ఫ్రాన్స్లో కూడా వాలెంటైన్స్ డే రోజున జరిగే 'లవ్ లాటరీ' విద్వేషాలకు దారితీస్తుండడంతో అక్కడి ప్రభుత్వం నిషేధించింది.